హుస్నాబాద్, మే 23: హుస్నాబాద్‌లోని పలు ఇండ్ల నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్న తమను కొందరు విలేకరులు వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణ ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు రైతులకు చెందిన పట్టా భూముల్లోంచి మట్టిని తీసి ఇంటి యజమానుల కోరిక మేరకు మట్టిని తరలిస్తుంటే కొందరు విలేకరులమని చెప్పి బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు వారికి డబ్బులు ఇచ్చామని మళ్లీ ఇవ్వాలని నిత్యం వేధిస్తూ ఉపాధి లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. పట్టా భూముల యజమానుల అనుమతితో మట్టి తరలిస్తుంటే అక్రమంగా తరలిస్తున్నారంటూ డబ్బులు ఇవ్వకుంటే అధికారులకు ఫి ర్యాదు చేస్తామని వార్తలు రాస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన పది మంది విలేకరులు నిత్యం ట్రాక్టర్ యజమానులను, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పదిమం ది పేర్లతో కూడిన జాబితాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతోపాటు అందించినట్లు హుస్నాబాద్ ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షుడు పినికాశి మల్లేశం తెలిపారు. ఈ విషయంపై ఎస్సై మహేశ్‌ను వివరణ కోర గా, విలేకరులపై ఫిర్యాదు చేశారన్నారు.