సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 11: జిల్లాలో బ్యాంకు లింకేజీ 100శాతం పూర్తి కావాలని, స్పెషల్ డెవెలాప్మెంట్ ఫండ్స్ కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషాతో కలిసి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, ప్లాంటేషన్, ఈజీఎస్ లేబర్ మొబిలైజేషన్, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై గ్రామీ ణాభివృద్ధి, పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలు ఈ నెల 31లోగా 100శాతం పూర్తి కావాలన్నారు. పూరైన క్రీడా ప్రాంగణాలన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా క్రీడా ప్రాంగణాలను తనిఖీ చేసి వచ్చే వారం రో జుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వచ్చే హరితహారానికి నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండాలన్నారు. నర్సరీలు సీడ్స్ బ్యాగ్ ఫిల్లింగ్ 100శాతం పూర్తి కావాలని సూ చించారు. సీడ్స్ నాణ్యతగా ఉండాలని, ఆయా అధికారులకు మార్గదర్శకాల మేరకు బాధ్యత అప్పగించాలన్నారు.
చేద్దాం అనే దృఢ సంకల్పంతో అందరూ కలిసి బృం దంగా పని చేస్తే తప్పకుండా ఆయా పనుల్లో విజ యం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈజీఎస్‌లో లేబర్ మొబిలైజేషన్ కావాలని, ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ తప్పనిసరిగా 50మందిని, పంచాయతీ కార్యదర్శి 100మందిని జనరేట్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. క్లస్టర్ వారీగా వైకుంఠ రథాలు ఏర్పాటు చేయడంతో పాటు వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు, బాడీ ఫ్రీజర్లు వినియోగంలోకి తీసుకురావాలని సూచించా రు. ఆయా విషయాలపై మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని వివరించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాటరింగ్ విధిగా జరుగాలని, మహాప్రస్థానం, క్రీడాప్రాంగణాలు, డంపింగ్‌యార్డులు, తడి పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ తదితర విషయాల్లో మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. సంతోషంతో బాధ్యతగా పని చేయాలని, మున్సిపల్ కమిషనర్లు వారి జాబ్ చార్ట్‌ను పాటించాలన్నారు. పట్టణంలో ఉదయం 5గంటల నుంచి తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అప్పుడే ప్రజల మన్ననలు పొందుతారని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి పనుల పురోగతిలో వేగం పెం చాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, మెప్మా పీడీ గీత, మున్సిపల్ కమిషనర్లు, ఏపీడీలు, డీపీఎంలు, డీఈలు పాల్గొన్నారు.