మెదక్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేరొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సామాజిక, ఆర్థిక, సర్వే మార్గదర్శకాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి 18 వరకు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎన్యుమరేషన్ బ్లాకులు సూపర్వైజర్స్ కరెక్ట్‌గా నియమించుకోవాలని, 10 శాతం రిజ ర్వ్ స్టాప్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి కుటుంబం జాబితాను క్రమపద్ధతిలో తయారు చేయాల్సి ఉంటుందన్నారు. 2011 జనాభా లెకల ప్రకారం జిల్లాలో 1.68 లక్షల కుటుంబాలున్నాయని, 1600 మంది ఎన్యూమరేటర్లతో సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేలో సూపర్వైజర్లు పది శాతం ర్యాండమ్‌గా డేటా తనిఖీ చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఈ లిస్ట్ నమోదు చేసిన వెంటనే ఇంటికి స్టికర్ అతికించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా హవేళీఘనపూర్ వార్డు నెంబర్ ఒకటిలో సమగ్ర కుటుంబ సర్వే హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా క్షేత్రస్థాయిలో గృహ యజమానులతో మాట్లాడుతూ ఇంట్లో ఎంతమం ది ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరుగా వంట చేసుకుంటున్నారా, వీటన్నింటిని అడిగి తెలుసుకున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరుగా వంట చేసుకునే వారికి సపరేట్‌గానే సర్వే నిర్వహించాలన్నారు. తహసీల్దార్ సింధు రేణుక, ఎంపీడీవో రామేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
వెల్దుర్తి, నవంబర్ 1: సమగ్ర సర్వే కోసం కుటుంబాల నిర్ధారణ స్టిక్కర్లను ఇంటింటికీ అతికిస్తున్నారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపిక చేసిన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్ వేసి కుటుంబ యజమాని పేర్లను నమోదు చేస్తున్నారు. ఈ కుటుంబ నిర్ధారణ ప్రకారం కుటుంబాలను గుర్తించి సర్వేలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
రామాయంపేట, నవంబర్ 1: రామాయంపేట పురపాలికలోని 11వ వార్డులో సమగ్ర ఇంటింటి సర్వేలో మెదక్ ఆర్డీవో రమాదేవి పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. గృహాల జాబితాతో పాటు ఆధార్, రేషన్ కార్డు, భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్ వివరాలు సేకరించాలన్నారు. ఆమెతో తహసీల్దార్ రజినీకుమారి ఉన్నారు.