కొల్చారం, జులై 07 : ప్రజా సమస్యలపై జవాబుదారితనంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కొల్చారం తహసీల్ కార్యలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రికార్డుల భద్రత క్రమ పద్దతిలో ఉండాలన్నారు.
భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రికార్డు రూమును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసచారి, నాయిబ్ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.