రోడ్డు ప్రమాదాలు నివారించాలి
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రహదారుల భద్రత పై వివిధశాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
- అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
- జీరో యాక్సిండెంట్ జోన్‌గా మార్చాలి
- రోడ్డు భద్రత సమీక్షలో మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్,జూలై 22 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రహదారుల భద్రత పై వివిధశాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..మెదక్ జిల్లాను జీరో యాక్సిండెంట్ జోన్‌గా తీర్చిదిద్దాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసు, రవాణా, ఇంజినీరింగ్‌శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి పక్కన అక్రమంగా స్థలాలు ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. పెట్రోల్ బంకులు, షాపులకు లైసెన్స్‌లు జారీ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలన్నారు. నేషనల్ హైవే టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు లైటింగ్, బారికేడ్లు, రేడియం స్టిక్కర్స్, స్పీడ్ కంట్రోలింగ్ పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రామాయంపేట జంక్షన్ వద్ద రోడ్డు భద్రత పై ప్రత్యేక నిబంధనలు పటిష్టింగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్అండ్బీ ఈఈ శంకర్,జాతీయ రహదారి అధికారులు,పోలీసులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

