కోహెడ, డిసెంబర్ 6: సిద్దిపేట జిల్లా కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామాగ్రి, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీపడవద్దని, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. వంటల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేఖ పాల్గొన్నారు.