సిద్ధిపేట,జూన్ 28: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామపంచాయతీ, పంచాయతీరాజ్‌శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా వివిధ మండలాలకు ఇచ్చిన లక్ష్యాన్ని తప్పకుండా పూర్తి చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గుర్తించిన వివిధ ప్రాంతాల్లో ఫిట్టింగ్, ప్లాంటింగ్ చేయాలన్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీలు సకాలంలో ఫర్టిలైజర్, నీటిని అందిస్తే మొకలు ఏపుగా పెరిగే అవకాశం ఉందన్నారు.
నాటిన ప్రతి మొక బతకాలని, అధికారులు తరచూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వేప, రావి, మర్రి, చింత, నేరేడు లాంటి మొకలను ఎకువ శాతం నాటాలన్నారు. ప్రతి మండలంలోనూ వీఐపీ ప్లాంటేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఆయా మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈత, మునగ తోటకు ఎకువ ప్రాధాన్యం ఇవ్వాలని, మామిడి, జామ, సీతాఫలం, నారింజ, కొబ్బరి తోటలు పెంచాలని, ఇదివరకు తోటల పెంపకం చేపట్టిన రైతులతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఇతర రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
ఎన్ఆర్ఈజీఎస్ కూలీల శాతం పెంచాలని, నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలను ఇంజినీరింగ్ అధికారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సకాలంలో పూర్త్తిచేయాలన్నారు. జిల్లా గ్రామపంచాయతీశాఖలో ముఖ్యంగా పన్నువసూలు, మిషన్ భగీరథ తాగునీటిపైన దృష్టి కేంద్రీకరించాలన్నారు. సకాలంలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసి నీటి శాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు ల్యాబ్‌కు పంపించాలన్నారు.
నీరు శుభ్రంగా ఉంటే ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎకువశాతం అరికట్టవచ్చన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, డ్రైనేజీలు పొంగిపొర్లడం లాంటిది ఉన్నైట్లెతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ- 2025 గోడ పత్రికను ఆవిషరించారు. జడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, డీపీవో దేవకీదేవి, పంచాయతీరాజ్ ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, చిరంజీవు తదితరులు పాల్గొన్నారు.