రామచంద్రాపురం, మార్చి 20 : భెల్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ని బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రముఖ సినీహీరో రామ్ పోతినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎంఆర్ సంస్థ చైర్మన్ ఎంవీ రమణతో కలిసి మంత్రి షాపింగ్‌మాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి సంస్థ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. షాపింగ్‌మాల్ ప్రారంభం అనంతరం మంత్రి కలియ తిరుగుతు వస్ర్తాలను పరిశీలించారు. చైర్మన్ ఎంవీ రమణ మంత్రికి శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత వచ్చిన సినీహీరో రామ్ పోతినేనికి సంస్థ మేనేజ్మెంట్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఆయన షాపింగ్ మాల్లో కలియ తిరిగారు. ఆయన్ను తమ ఫోన్లో బంధించేందుకు అభిమానులు పోటీపడ్డారు. చైర్మన్ ఎంవీ రమణ హీరో రామ్ పోతినేనిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
అనంతరం రామ్ మీడియాతో మాట్లాడిన తర్వాత షాపింగ్ మాల్ బయట సందడి చేశారు. అభిమానులతో సరదాగా మాట్లాడి వారిని అలరించారు. ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎంవీ రమణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థగా సీఎంఆర్ ఎదిగిందన్నారు. సీఎంఆర్ సంస్థ వినియోగదారుల అభిమానాన్ని చూరగొని వస్త్ర వ్యాపారంలో దూసుకుపోతున్నట్లు చెప్పారు. అన్నివర్గాల ప్రజలు సీఎంఆర్‌లో షాపింగ్ చేసుకునేలా ధరలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వినియోగదారులకు సరసమైన ధరలకే వస్త్రాలు విక్రయిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. భెల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ బ్రాంచ్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంస్థ ఎండీ మోహన్బాలాజీ, జీఎం లింగమూర్తి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ సి.జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నాయకుడు జె.రాజు, నదీం ఉల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.