సిద్దిపేట, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నర్మెట గడ్డ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అబద్ధాలు వల్లించాడు. సిద్దిపేటపై తన అక్కసును వెల్లగక్కాడు. తనకు సిద్దిపేటపై వివక్ష ఎందుకుంటదని అంటూనే వివక్షతను చాటుకున్నాడు. తానే వివక్ష చూపితే నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని తీసుకుపోతుంటికి కాదా ఆదివారం నర్మెటలో జరిగిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సభావేదికపై నుంచి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ ఫ్యాక్టరీ పనులు బీఆర్ఎస్ హయాంలో సగానికి పైగా పూర్తయ్యాయి కాబట్టి తీసుకుపోలేదు… లేకపోతే దానిని కూడా తీసుకుపోదువు.
సిద్దిపేట వెటర్నరీ కళాశాలను తీసుకుపోయింది నిజం కాదా..? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులు రద్దు చేసింది నిజం కాదా..? నిధులు రద్దు చేయడంతో అవన్నీ అసంపూర్తి పనులతో కనిపిస్తున్నది నిజం కాదా…? ఇవన్నీ చేసి మళ్లీ అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్‌కు పరిపాటిగా మారింది. సిద్దిపేటలో చేసిన అభివృద్ధిని చూసి రేవంత్‌రెడ్డి ఓర్వలేక పోతున్నారు. పైగా ఎన్ని నిధులైనా ఇస్తాను, అన్ని నియోజకవర్గాల మాదిరిగానే సిద్దిపేట అని చెబుతున్నాడు. ఇది రాజకీయాలకు సమయం కాదు.. అంటూనే రాజకీయాలు మాట్లాడుతూ.. సిద్దిపేటపై రేవంత్‌రెడ్డి నర్మెట గడ్డ సాక్షిగా తన అక్కసును వెళ్లగక్కారు. మీది వివక్ష చూపే తత్వం కానప్పుడు.. సిద్దిపేట అభివృద్ధికి సంబంధించిన నిధులు ఎందుకు నిలిపివేశావు అని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజా పాలనలో రైతు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు సిద్దిపేట జిల్లాలో రూ. 775.72 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులతో కలిసి సీఎం నర్మెటలోనే శంకుస్థాపన చేశారు. అకడ పెట్టుబడి సాయం రైతుభరోసా నిధులు విడుదల చేశారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటపై తనకు, ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. ఇక్కడి ప్రాంతంపై వివక్ష నిజమే కాదా…

ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ చూశాక సీఎం రేవంత్ అక్కసు..
సిద్దిపేట అభివృద్ధ్దిని చూశాక… నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పరిసరాలు చూశాక, ఇంత మంచి ఫ్యాక్టరీ ఇక్కడ ఎందుకు ఉందనే అక్కసు సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లోనే బయటపడింది. సిద్దిపేటపై ఉన్న వివక్షను ఆయన చెప్పకనే చెప్పారు. పామాయిల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు కేటాయించింది. నర్మెట గ్రామ రైతుల సహకారంతో టీజీఐఐసీ ద్వారా 62ఎకరాల భూమిని ఫ్యాక్టరీ నిర్మాణానికి సేకరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎకడా లేనివిధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో మలేషియా టెక్నాలజీతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించాలని పూనుకుంది. బీఆర్ఎస్ హయాంలోనే సగానికి పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ వచ్చాక ఫ్యాక్టరీ రద్దు చేస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరువుతుందని సీఎం దానిని ముట్టుకోలేదు. తాను వివక్ష చూపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఫ్యాక్టరీని కొడంగల్‌కు తరలించేవాడిని అని ఆదివారం సభలో రేవంత్ మాట్లాడిన మాటలతో వివక్ష అర్థమైంది.
రూ. 1070 కోట్ల నిధులు రద్దు చేసింది.. వివక్ష కాదా..?
నువ్వు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 1070కోట్ల నిధులు అర్ధాంతరంగా రద్దు చేశావు. నిధులు రద్దు చేయడంతో ఎకడి పనులు అకడే ఆగాయి. నియోజకవర్గ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల్లో ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా? గత మూడు సీజన్లుగా వడగళ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు రావాల్సిన పరిహారం మంజూరు చేయలేదు. ఇవ్వాళ ఇచ్చాం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నీ అబద్ధ్దాలు చెప్పారు.
ఇవన్నీ రద్దు చేసింది.. వివక్ష కాదా..?
సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులను మీరు రద్దు చేశారు. కోమటిచెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగు రోడు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట- కిష్టాపూర్ రహదారి, సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మారెట్ పనులు ఆపింది నువ్వు కాదా అని రేవంత్ తీరును ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రంగనాయక సాగర్ టూరిజం రద్దు .. వివక్ష కాదా..?
సిద్దిపేట పట్టణానికి ఆనుకొని ఉన్న రంగనాయక సాగర్ టూరిజం సర్క్యూట్ పనులు పునాది స్థాయిలోనే రద్దు చేసింది నిజం కాదా? అక్కడ పర్యాటకంగా మరిన్ని సొబగులతో తీర్చేదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే, ఆ నిధులు రద్దు చేశావు. రూ.100కోట్లతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయి వెక్కిరిస్తున్నది నిజం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆగిన వెయ్యి పడకల దవాఖాన.. వివక్ష కాదా..?
నిధులు కొరత కారణంగానే వెయ్యి పడకల దవాఖాన పనులు ఆగింది నిజం కాదా…? సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి పడకల దవాఖాన నిర్మాణం పూర్తి చేసుకొని, చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నా యి. వాటిని పూర్తి చేయడంలో నిధుల కొరత ఇబ్బంది పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటికి నిధులను విడుదల చేయక పోవడంతో అది పెండింగ్‌లోనే ఉన్నది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
రోడ్డు విస్తరణ నిధులు రద్దు చేసింది… వివక్ష కాదా..
సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే రహదారి విస్తరణ పనులను మధ్యలోనే అపింది మీరు కాదా… సీఎం రేవంత్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు పనులుఏ రద్దు చేయడంతో రోడ్డు గుంతలుగా మారి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల బాధలు , కష్టాలు మీకు పట్టవా..? నిధులు కోత పెట్టి మళ్లీ ఏం చేయనట్లు మాట్లాడితే ఇక్కడి ప్రజలు మరిచిపోరు ..
వెటర్నరీ కళాశాలను కొండగల్‌కు తీసుకుపోయింది నిజం కాదా..
సిద్దిపేట మీద ఎందుకు కక్ష అంటూనే సిద్దిపేట వెటర్నరీ కళాశాలను మీ కొడంగల్ నియోజకవర్గానికి తీకసుకుపోయింది నిజం కాదా..? కళాశాల పనులను మధ్యలో ఆపి తీసుకుపోయిన విషయం ఇక్కడి ప్రజలు ఎలా మర్చిపోతారు సీఎం రేవంత్. ఇవాళ మీరు చెప్పేవన్నీ అబద్ధ్దాలే. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విద్యాలయం వెటర్నరీ కళాశాలను మంజూరు చేసింది. ఈ దానికి 30 ఎకరాల విస్తీర్ణంలో బాలురు, బాలికల వసతితో పాటు కళాశాల నిర్మాణం చేపట్టేలాగా రూ. 180 కోట్ల నిధులతో రూపకల్పన చేసి పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే దీనిని అర్ధ్దాంతరంగా నిలిపివేశారు. ఇది వివక్ష కాదా? అని ఇక్కడి ప్రజలు సీఎం రేవంత్‌ను అడుగుతున్నారు.