చేర్యాల, మార్చి 13 : రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్-3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలను ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలో నిరసన దీక్షలు ప్రారంభించారు.
గురువారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షల సందర్భంగా ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్చార్జీ మల్లిగారి యాదయ్య, మండల ఇన్చార్జీ సనవాల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామనని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి.. ఆ హామీ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జీ మల్లిగారి యాదయ్య, మండల ఇన్చార్జీ సనవాల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగపాక బాబు, ఎర్రోల్ల శ్రీనివాస్, భూమిగారి మధుకర్, మల్లిగారి నర్సింహులు, ఎర్రమైసగల్ల గణేష్, మల్లిగారి శ్రీనివాస్, సంతోష్, కుమార్, మహేందర్ పాల్గొన్నారు.