మెదక్ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 23 ;సీఎం కేసీఆర్‌కు మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి మెదక్ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రికి గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వెల్కమ్ చెప్పారు. అక్కడి నుంచి మెదక్ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్లో దివ్యాంగులకు పెంచిన రూ.4,016 పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు పింఛన్లను అందజేశారు. అనంతరం సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో నిర్వహించిన ప్రగతి శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించారు. సభకు మెదక్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారుల నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణమంతా గులాబీమయమైంది. –
మెదక్ జిల్లా ప్రగతి శంఖారావానికి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గుమ్మడిదల మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు గుమ్మడిదల టోల్‌ప్లాజా వద్ద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వేలాదిమంది బీఆర్ఎస్ శ్రేణులతో అపూర్వ స్వాగతం పలికారు. వేలాదిమంది కార్యకర్తలు, మహిళలు, యువకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలను చేతబూని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒగ్గు కళాకారులు, తెలంగాణ సాంస్కృతిని అద్దం పట్టే బతుకమ్మలు, బోనాలు, గుర్రాలు, పోతురాజుల విన్యాసాలు, గంగిరెద్దులు, పీర్లు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, కోయలు, లంబాడి నృత్యాలు, తెలంగాణ దూందాంను తలపించేలా జానపద కళాకారుల ఆటపాటలతో గుమ్మడిదల టోల్‌ప్లాజా గులాబీమయంగా మారింది. అన్నారం నుంచి మంబాపూర్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, భారీ కటౌట్లను, బీఆర్ఎస్ జెండాలను ఏర్పాటు చేశారు. అడుగడుగునా ఆటపాటలతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం పలికారు.
25వేల మందితో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
మెదక్ బహిరంగ సభకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి రామచంద్రాపురం, అమీన్పూర్, పటాన్చెరు పట్టణ ప్రజలతో బొల్లారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులు గుమ్మడిదల టోల్ ప్లాజా వద్దకు భారీగా చేరుకున్నారు. పటాన్చెరు నుంచి భారీ కాన్వాయ్‌తో వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్చెరు మైత్రీ గ్రౌండ్ నుంచి వందలాది కార్ల భారీ కాన్వాయ్‌తో గుమ్మడిదల టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌కు గులాబీ శ్రేణులు గులాబీపూలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ ప్రభాకర్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, ఎంపీపీ సద్ది ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, మహిళలతో కలిసి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు
మూడోసారి పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కోయలు, యాదవసంఘం, బ్రహ్మణ సంఘం, మైనార్టీలు, పాస్టర్లు, వివిధ కులసంఘాలు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కోయలు కొమ్ముల టోపితో వాయిద్యాన్ని అందించారు. యాదవులు గొంగడితో సన్మానించారు. పోతరాజుల చెర్నకోలా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేకు గులాబీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.
కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేస్తాం : సీఎం కేసీఆర్
కాళేశ్వరం జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీమెజార్టీతో విజయానందించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల, జిన్నారం మండలాల్లో కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరాకు సాగునీరందించి పచ్చని పొలాలతో సస్యశ్యామలం చేసి రైతుల కండ్లల్లో ఆనందం నింపుతామన్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండలం లో సమీకృత ప్రభుత్వ భవనాలు, మినీస్టేడియం, జూనియర్ కాలేజ్, మినీట్యాంక్‌బండ్, అగ్నిమాపక కేంద్రం, గోదాం భవనాలు కావాలని, పలు అభివృద్ధి పనులపై సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివేదిక అందజేయగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సభాప్రాంగణంలో సీఎం కేసీఆర్‌కు నివేదికను సమర్పించారు.
మాకు పెద్దన్న కేసీఆర్ సార్
నేను చదువుకున్న&అయినా ఉద్యోగం లేదు. పని చేద్దామంటే నా శరీరం సకరించదు. మా దివ్యాంగులకు పింఛన్ పెంచి సీఎం కేసీఆర్ పెద్దన్నయ్యాడు. కూలి పని చేస్తూ మాలాంటి దివ్యాంగులు బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్ సార్ సీఎం కావడంతోనే ముందు రూ.30 16 ఇచ్చిం డు. ఇప్పుడు ఏకంగా రూ.4016 ఇస్తుం డు. ఇప్పుడు హాయిగా ఆ పింఛన్‌తో మా అమ్మానాన్నను కూడా బతికించుకుంటాం.
-తోట శ్రీలత, శివ్వాయపల్లి, మెదక్ జిల్లా
అచ్చే ఎలచ్చన్లలో కేసీఆర్ సార్కే ఓటేపిస్తా..
మాకు పింఛన్లు పెంచి ఆదుకున్న కేసీఆర్ సారును అచ్చే ఎలచ్చన్లలో గెలిపించుకుంటాం. మా దివ్యాంగులను ఆదుకున్న దేవుడు ఆయన. ఆయన గెలుపు కోసం ఇప్పటినుంచే పని చేస్తాం. గిప్పుడు పద్మక్క పుణ్యమా అని మాకు పింఛన్ పెరిగింది. నేను కచ్చితంగా పద్మక్కను గెలిపించడమే గాదు.. పద్మక్క వెంట తిరిగి ఓట్లేపిస్తా.
– శెట్టి కొముర్య, మగ్దుంపూర్, మెదక్ జిల్లా
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సార్ మేము అడగకుండానే అన్నం పెట్టిండు. మన ఇంట్లో ఉన్న వాళ్లు అడగకుంటే అన్నం కూడా పెట్టరు. అటువంటిది మా పరిస్థితిని గమనించి పింఛన్ మంజూరు చేసిన పెద్దదిక్కు సీఎం కేసీఆర్ సార్. ఆయనను మా జీవితంలో ఎప్పటికీ మరువం. టేకేదారుల జీవితాల్లో వెలుగులు నింపి ఆదుకున్న సీఎం కేసీఆర్ సార్కే మళ్లీ ఓట్లు వేసి గెలిపించుకుంటాం.
-అంకాలం రవీందర్, పులామామిడి, చేగుంట మండలం, మెదక్ జిల్లా
కమీషన్‌పై బతికే మాకు పింఛన్ ఇచ్చిన దేవుడు
కార్ఖానాలను కమీషన్లపై నడిపించుకుం టూ బతికేటోళ్లం. మా బతుకులు మారతాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా బాధలు చూసి సీఎం కేసీఆర్ సార్ నెలకు ఆసరా కింద రూ.2,016 పింఛన్ ఇచ్చి మా జీవితాలకు తొవ్వ చూపిన దేవు డు. మేము ఎప్పుడు ఆయనను మరువం. సీఎం కేసీఆర్ సార్కే మద్దతు ఇచ్చి గెలిపించుకుంటాం.
– ముంచిరాల నరేందర్‌రెడ్డి, కల్వకుంట, నిజాంపేట మండలం
జిన్నారం నుంచి వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
గుమ్మడిదల టోల్‌ప్లాజా మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిన్నారం మండలం నుంచి వేలాదిమంది బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. సీఎం కేసీఆర్ జై అంటూ నినాదాలు చేశారు. సభాప్రాంగణం జనంతో కిక్కిరిసి పోయింది. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు జడ్పీటీసీ చిన్నపాపని కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ మంజులావెంకటేశ్గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, మూడుచింతల నరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సోష ల్ మీడియా అధ్యక్షుడు ఫయాజ్ షరీఫ్, సర్పంచ్‌లు చిమ్ముల నర్సింహారెడ్డి, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, కంజర్ల శ్రీనివాస్, మేడిపల్లి మురళి, దోమడుగు శంకర్, హనుమంత్‌రెడ్డి, వాసవీదామోదర్రెడ్డి, రేణుకాస్వామి, ఆంజనేయులు, దీపానరేందర్రెడ్డి, మమతావేణు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు మంగళవారం రాత్రి నుం చి బుధవారం ఉదయం వరకు భారీ ఏర్పాట్లు చేశారు. వీరికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అభినందనలు తెలిపారు.