హ్యాట్రిక్ సీఎంగా కేసీఆరే ఎన్నికవుతారని, ఇది మన ఓటుతో మనం నిర్ణయించడం మన అదృష్టమని రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, తెలంగాణ ఫుడ్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి అన్నారు. కోనాయపల్లి (పీబీ)లో నిర్వహించిన రోడ్‌షోలో వారు పాల్గొని, బీఆర్ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని మల్కాపూర్, నర్సంపల్లి, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్, యావాపూర్, ఇమాంపూర్, ఘనపూర్ గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసిందేమీలేదన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
తూప్రాన్, నవంబర్ 13: మనం వేసే ఓటుతోనే ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, తెలంగాణ ఫుడ్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్‌కు మద్దతుగా తూప్రాన్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. సోమవారం ఉదయం తొలుత కోనాయపల్లి (పీబీ)లో నిర్వహించిన రోడ్‌షోలో వారు పాల్గొని, బీఆర్ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని మల్కాపూర్, నర్సంపల్లి, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్, యావాపూర్, ఇమాంపూర్, ఘనపూర్ గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కళాకారుల ఆటపాటలు అలరించాయి. బీఆర్ఎస్ నేతలు ప్రచార కార్యక్రమానికి వస్తున్నారంటే ప్రజలంతా పనులు మానుకుని ఆద్యాంతం ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో గ్రామస్తులు, మహిళలు బతుకమ్మ, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కల్లాల దగ్గర కొత్త బిచ్చగాళ్లు వచ్చినట్లు ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారని, వాళ్ల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసిందేమీలేదన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిస్తున్న రూ.2 వేల పింఛన్‌ను రూ.5వేలకు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఇంటింటికీ తాగునీరు, సాగునీరు అందివ్వడంతో పాటు, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. ఎక్కడ చూసినా ప్రగతి పరుగులే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని గడప లేదంటే అతిశయోక్తి కాదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు సామాన్యుల నడ్డి విరుస్తూ, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకొస్తే ఆరవై ఏండ్ల పాలనలో ఏంచేశారో నిలదీయాలన్నారు. కులమతాల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రతిపక్షాల ఆరాటమన్నారు. బీజేపీ అంటే ఝూటా మాటల పార్టీ అన్నారు. కులవృత్తుల ఆర్థికాభివృద్ధికి చేయూతనందించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి వ్యక్తికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా, అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, వృద్ధులకు రూ.5 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, రైతు బంధు సాయం రూ.16 వేలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు రూ.3 వేల జీవన భృతి, ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్నావెంకటేశ్ యాదవ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, కోనాయపల్లి సర్పంచ్ పాండు, మల్కాపూర్ సర్పంచ్ మహాదేవి నవీన్, నర్సంపల్లి సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, వెంకటాయపల్లి సర్పంచ్ లంబ వెంకటమ్మ, గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ శ్రీలత రాజిరెడ్డి, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఇమాంపూర్ సర్పంచ్ ఎల్లం, ఘనపూర్ సర్పంచ్ పుష్పానవీన్, ఎంపీటీసీలు సంతోష్‌రెడ్డి, వెంకటమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.