ఉద్యోగాలు క్రమబద్ధీకరించడంతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ..వీఆర్ఏలు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం వారి విద్యార్హత ఆధారంగా వివిధ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేయడంతోపాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. అంతేకాకుండా పే స్కేల్‌ను ప్రభుత్వం అమలు చేయనున్నది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 2273 మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాల్లోని వీఆర్ఏలు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
పెద్దశంకరంపేట/ రామాయంపేట/ చిలిపిచెడ్, జూలై 25 : ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ… పేస్కేల్ వర్తింపజేస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వీఆర్ఏలు సంబురాలు నిర్వహించారు. మెదక్ జిల్లావ్యాప్తంగా బుధవారం వీఆర్ఏల తోపాటు కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్‌కు సంబంధించిన జీవో నంబర్ 81 విడుదల చేసిందన్నారు. విద్యార్హత, సర్వీసు ఆధారంగా నాలుగు విభాగాల్లో వివిధ శాఖల్లో విలీనం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రూ.10 వేలు ఉన్న వేతనాన్ని రూ.30 వేలకు పైగా పెంచి తమ ఉద్యోగాలకు భరోసా కల్పించారన్నారు. వేతనాల పెంపుతో జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీఆర్ఎల సంఘం మండలా ధ్యక్షుడు కట్ట రవీందర్, ఉపాధ్యక్షుడు భాగయ్య, ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి బేతయ్య, సలహదారులు సుదర్శన్, సభ్యులు మమత, సామెల్, సాయిలు, అశోక్, వేణు, నర్సింహులు, లింగమయ్య తదితరులున్నారు.
వీఆర్ఏలకు పే స్కేల్ మంజూరు పట్ల హర్షం
రామాయంపేట పట్టణంలో వీఆర్ఏలు సంబురాలు నిర్వ హించారు. తహసీల్ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేల్ మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. మా జీవిత కాలం సీఎం కేసీఆర్‌ను మరచిపోమన్నారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిసూ పే స్కేల్ మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏలు సైదయ్య, స్వప్న, కల్యాణ్, వైష్ణవి, నవనీత, నాగమణి, బాబు ఉన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
చిలిపిచెడ్ తహసీల్ కార్యాలయం ఎదటుసీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు క్షీరాభిషేకం నిర్వహించారు. వీఆర్ఏలను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీఆర్ ఏల సంఘం మండలాధ్యక్షుడు కిష్టయ్య, నాయకులు నర్సింహులు, బుజ్జమ్మ, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.