నిజాంపేట్, సెప్టెంబర్ 1 : దివ్యాంగులు గౌరవంగా జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో 81 మంది దివ్యాంగులకు పింఛన్ పత్రాలు అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలకు చేయూతనిచ్చి, వారి కుటుంబాల్లో వెలుగు లు నింపిందన్నారు. ప్రభుత్వ పథకాల అమ లులో అవినీతి లేకుండా పారదర్శకంగా ఉంటూ ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జగదీశ్వర్‌చారి, ఉప సర్పంచ్ రామచంద్రరావు, అదివప్ప, వార్డు సభ్యులు రజాక్, నర్సిం హులు, యాదగిరి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత సాయిరెడ్డి ఉన్నారు