కల సాకారం
గిరిజన తండావాసుల కళ సాకారమైంది. మెదక్ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలు చేస్తానన్న హామీని ఎమ్మెల్యే నెరవేర్చారు. మెద క్ నియోజకవర్గంలో 11 కొత్త గ్రామ లపంచాయతీలను చేయించారు. గిరిజనుల చిరకాల కోరిను తీర్చారు.
- మెదక్ నియోజకవర్గంలో 11 నూతన గ్రామ పంచాయతీలు
- గిరిజనుల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్
- తండాల్లో పెద్ద ఎత్తున సంబురాలు
- సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
- పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్న ప్రజలు
- బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని వెల్లడి
- సేవాలాల్ దేవాలయాల్లో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పేర్లపై అభిషేకాలు, పూజలు
- కొత్త పంచాయతీలను అభివృద్ధి చేస్తా
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డాక తండాలను పంచాయతీలుగా గుర్తిస్తూ అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నది. తాజాగా మెదక్ నియోజకవర్గంలో 11 నూతన పంచాయతీలను ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆదివారం ప్రజలు పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా తాము పడుతున్న కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ తండాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, దవాఖానల్లాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికే ఓట్లు వేస్తామని తండావాసులంతా నిజాంపేట మండలం షౌకత్పల్లిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
-రామాయంపేట, ఆగస్టు 6
రామాయంపేట, ఆగస్టు 6 : గిరిజన తండావాసుల కళ సాకారమైంది. మెదక్ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలు చేస్తానన్న హామీని ఎమ్మెల్యే నెరవేర్చారు. మెద క్ నియోజకవర్గంలో 11 కొత్త గ్రామ లపంచాయతీలను చేయించారు. గిరిజనుల చిరకాల కోరిను తీర్చారు. దీంతో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామాల్లోని గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి పటాకులు కాల్చారు. మా దేవత పద్మక్క, మాకు మరో సేవాలాల్ సీఎం కేసీఆర్ అంటూ సేవాలాల్ దేవాలయంలో అభిషేకాలు పూజలు చేశా రు. ఉమ్మడి రామాయంపేట మండంలోని నిజాంపేట మండలంలో షౌకత్పల్లి, ఖాసింపుర, రామాయంపేట మండంలోని దంతెపల్లి గ్రామ పంచాయతీలోని ఆరు గిరిజన తండాలు బిల్యా తండా, సుభాశ్ తండా, తీన్నంబర్, భిక్షపతి తండా, రాంచందర్ తండా, జమ్లా తండాలను కలిసి బిల్యా తండా కేంద్రంగా పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీగా ఏర్పడడంతో గిరిజనులు వారి తండాల్లో పండుగ వాతావరణంలా సంబురాలు చేశారు.
నూతనంగా ఏర్పడిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు
నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీలకు ప్రత్యేక నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్లో మాట్లాడారు. చిన్న పంచాయతీల ఏర్పాటుతోనే ఆర్థిక స్వావలంబన చేకూరిందని, అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్లామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తం గా 11 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధే ధ్వేయంగా తెలంగాణ సర్కా రు పనిచేస్తున్నదన్నారు.
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి మా తండా ప్రజలు జీవిత కాలం రుణపడి ఉంటారు. ఆరు తండాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం. దీంతో మాతండాలు అభివృద్ధ్దికి బాటలు పడతా యి. ఆరు తండాలను కలిపి పంచాయతీగా మార్చడం అంటే ఆషా మాషి కాదు. ఎంతో సాహసంతో కూడుకున్న విషయం. అదరక బెదరక సీఎం సార్‌తో ఒప్పించి తండాలను పంచాయతీలుగా మార్చిన పద్మక్కను తండా ప్రజలు రుణపడి ఉంటారు.
-లంబాడీ సురేశ్ నాయక్, తెపల్లి సర్పంచ్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

