తొగుట : గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కష్టాల పాలుచేస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు. దసరా పండుగను పురస్కరించుకొని మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ కార్మికులకు నూతన బట్టలు అందించారు.
పంచాయతీ కార్మికులకు నెల నెలా జీతం చెల్లించక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి సక్రమంగా జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమం లో నాయకులు బండారు స్వామి గౌడ్, పిట్ల వెంకటయ్య, జీడిపల్లి గోవర్ధన్ రెడ్డి, బెజ్జనమైన శ్రీనివాస్, ఎర్రోళ్ల చంద్రం,పాత్కుల స్వామి, ఈదుగాళ్ల పర్శరాములు, పాత్కుల వెంకటేష్, పిట్ల వెంకటేష్, పులిగారి గణేష్, ఎంగలి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.