సిద్దిపేట, ఆగస్టు 28: గ్రేడింగ్‌తో సంబం ధం లేకుండా వేతనాలివ్వాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సెర్ప్‌లో పనిచేస్తున్న ఐకేపీ వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నా రు. రూ.5వేల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, రూ.26వేల వేతనంతో పాటు, 10లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్, తలపాక కిష్టయ్య, మహేశ్, ఎల్ల స్వామి, ఐకేపీ, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.