నర్సాపూర్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ జాన్ రెడ్డి సూచించారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో విజన్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ జాన్ రెడ్డి, ట్రైనింగ్ ఎస్సై శిరీష, ఎక్సైజ్ ఎస్సైలు రాఘవేందర్ రావు, అజీజ్, అరుణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఎవరైనా రవాణా చేసిన, విక్రయించిన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ సరళ కుమారి, అంగన్వాడి టీచర్లు, విజన్ సంస్థల ప్రతినిధి పి. అపర్ణ, ఇన్చార్జి డి.వినేష్ కుమార్, రాజు, సురేందర్, శివ, శిరీష, అల్లూరి సీతా రామరాజు పాల్గొన్నారు.