కంది, ఏప్రిల్ 16: కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన రజతోత్సవ సభకు గులాబీదండు కదం తొక్కాలని, జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
బుధవారం సంగారెడ్డిలో సభకు సంబంభించిన వాల్‌పోస్టర్లను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన అతికించి జై తెలంగాణ నినాదాలు చేశారు. సంగారెడ్డి మొత్తం గులాబీమయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు సాయినాథ్, నర్సింహులు, చక్రపాణి, విఠల్, గోవర్ధన్, మల్లేశం, మల్లాగౌడ్, శ్రవణ్‌రెడ్డి, ప్రేమానందం, షఫీ పాల్గొన్నారు.