తెలంగాణకు అన్యాయం.. బీజేపీది అవినీతి పాలన
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థతతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
- కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని వ్యాగన్‌తో సరిపెట్టారు
- బీజేపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది
- సీఎం కేసీఆర్‌పై ప్రధాని విమర్శలు అర్థరహితం
- గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలు ఏవీ..
- టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థతతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
సంగారెడ్డి, జూలై 8: తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాటలు వట్టివేనని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, వ్యాగన్ ఫ్యాక్టరీతో సరిపెట్టడం సరికాదని టీఎస్ హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని నిబంధనలు మర్చిపోయిన బీజేపి సర్కారే అవినీతిలో కురుకుపోయిందన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీతో పాటు కొత్త రైల్వే లైన్‌కు నిధులు కేటాయిస్తామని మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జిల్లాలోని వెలిమలలో ఈనెల 2న మేఘా సంస్థ యాజమాన్యం నిర్మించిన కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో ప్రధానికి కనువిప్పి కలిగిందన్నారు. అందుకే వరంగల్‌లో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి చేతులు దులుపుకొన్నారన్నారు.
దేశానికి ఆదర్శంగా ఎదుగుతున్న తెలంగాణపై మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మాటలు తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని, ఉద్యమ స్వభావంతో ప్రజల ఆకాంక్షలు నేరవేర్చని నాయకులకు తగినవిధంగా ప్రజలు బుద్ధి చెపుతారని చురకలంటించారు. రాష్ర్టానికి వచ్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పా అభివృద్ధిని నిధులు ఇవ్వడంలో సవతి తల్లి ప్రేమను ప్రధాని వలకబోస్తున్నారన్నారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మాట ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గొప్పతనంతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, ఇది చూసి బీజేపీ నాయకులు గర్వపడకుండా అడ్డుకోవడం విడ్డూరని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు ప్రధాని మోదీకి లేదని, తాటాకు చప్పుళ్లకు తెలంగాణలో భయపడేవారు లేరన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

