సదాశివపేట, నవంబర్ 13 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు.
అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులు, ఇంకా ఇబ్బంది పడకుండా కొనుగో లు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గన్నీబ్యాగులు, గౌడాన్ సౌకర్యాలు, తూకం పరికరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొలత, రవాణా, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని,రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ధాన్యం చెల్లింపులు ఆలస్యం కాకుండా బ్యాంకు అధికారులను సమన్వయం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఆల స్యం కాకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు.
కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పాండునాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్‌రెడ్డి, రైతు బంధు సమితి మాజీ చైర్మన్ అమరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు చీల మల్లన్న, పెద్దగొల్ల ఆంజనేయులు, మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్, మం డల వ్యవసాయాధికారి రమేశ్, ఏఈవో శ్రీదే వి, బీఆర్ఎస్ నాయకులు వీరేశం, సమీ, సుధాకర్, అహ్మద్, రవి, శివకుమార్, అశోక్, లక్ష్మారెడ్డి, నవీన్, నరేశ్‌గౌడ్, దశరథ్, సంగ న్న, మాణయ్య, చంద్రన్న, సలాఉద్దీన్, సిద్ధ్దన్న, కుమార్, శేఖర్, రాములు, నగేశ్కురుమ, రాజశేఖర్‌రెడ్డి, శ్రీరాములుగౌడ్, గోపాల్‌రెడ్డి, శంభుప్రసాద్, శ్రీశైలం, తొంటరాజు, అక్షయ్, నయీమ్ పాల్గొన్నారు.