ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అతడి చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
- సంగారెడ్డి కలెక్టర్‌కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు వినతి
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 22: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అతడి చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అభివృద్ధి పనులను వేగవం తం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని, సదాశివపేట మండ లం బొబ్బిలిగామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకున్నదని, పాఠశాల భవనం గోడలు దెబ్బతినడంతో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉన్నదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే తగిన మరమ్మతులు చేపట్టాలని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూ రు చేయాలని కోరారు. ఎస్డీఎఫ్ కింద రూ.5 కోట్లతో నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, 4 మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్‌లో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నంబర్లు జారీ చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కంది మండలం ఉత్తర్పల్లి గ్రామ పరిధిలో రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల అంచనాతో పరిపాలన అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సూరారం ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గిర్మాపూర్‌లో రీజినల్ రింగ్ రోడ్డు భూ బాధితులకు నష్ట పరిహారం చెల్లింపులో బయోమెట్రిక్ విధానాన్ని సడలించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే సక్రమంగా చేయడం లేదని కలెక్టర్‌కు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

