నారాయణఖేడ్, జనవరి 24: అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులుడడంతో ఆరుగురు చిన్నారులు గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రాగా, కేంద్రంలో పిల్లలు ఉన్నచోటే ఒక్కసారిగా పై కప్పు పెచ్చులూడి పడ్డాయి. మొత్తం 27మంది పిల్లలు ఉండగా, ఆరుగురు చిన్నారులు హరిక, అంకిత, అవినాష్, మౌనిక, రిషిక, ప్రణయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి.
వారిని నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. విషయన్ని తెలుసుకున్న కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హుటాహుటిన దవాఖానకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనకు బా ధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, గాయపడన చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మిగతా పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని, తీవ్రంగా గాయపడిన పిల్లలను వైద్యుల పర్యవేక్షణ లో ఉంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.