కంది, మార్చి 12: నలబైఐదు గజాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇల్లు సరిపోతుందా, ఆ ఇంట్లో ఉండేదెలా అని సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్ గ్రామస్తులు కలెక్టర్ వల్లూరు క్రాంతి దృష్టికి తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా చేర్యాల్ గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామంలో ఇంటి స్థలం ఉన్న 164 మందిని ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 65 ఇండ్లు నిర్మించేందుకు అధికారులు చర్య లు తీసుకుంటున్నారు.
బుధవారం కలెక్టర్ క్రాంతి చేర్యాల్ గ్రామంలో పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. నిర్మాణ పనులను వేగవంతం, నాణ్యతపై దృష్టిసారించాలని అధికారులను ఆమె ఆదేశించారు. 45 గజాల్లో ఇంటిని నిర్మించుకుంటే అందులో ఎలా ఉండాలని, స్థలం తమదే కాబ ట్టి కొంచెం స్థలాన్ని పెంచుకునే అవకాశం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరపున ఇచ్చే రూ.5లక్షలే ఇవ్వండని పెంచిన, స్థలానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము నడుచుకోవాల్సి ఉంటుందని, ఇందులో తామేమి చేయలేమని కలెక్టర్ వారికి తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి విన్నవిస్తామన తెలిపారు. అనంతరం కంది రైతువేదిక వద్ద నిర్మిస్తున్న ఇం దిరమ్మ మోడల్ హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూ టీ తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుదీర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ చలపతిరావు, ఏఈ మాధవరెడ్డి, నాయకులు జూలకంటి ఆంజనేయులు పాల్గొన్నారు.