Collector Rahul Raj | పాపన్నపేట, మార్చి 19 : వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడుపాయలకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయలలో సౌకర్యాలు కరువు అని కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు.
ఈ మేరకు కలెక్టర్ ఇవాళ ఏడుపాయలకు చేరుకొని ఏడుపాయల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపురం నుండి ఆలయం వరకు చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడమే కాకుండా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.
ఏఏ వారాలలో ఎంతమంది భక్తులు ఏడుపాయలకు వస్తారు అంటూ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పాపన్నపేట తహసీల్దార్ సతీష్, పూజారి శంకర శర్మ తదితరులున్నారు.