ఒంటరి మహిళలే టార్గెట్
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నా యి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం ఉండడంతో మహిళలు నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలాల వద్ద ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు.
- రెచ్చిపోతున్న చైన్స్నాచర్లు
- గ్రామీణ ప్రాంతాలపై గురి
- పొలాల వద్ద మహిళల మెడనుంచి గొలుసులు తస్కరణ
- భయాందోళనలో శివారు ప్రాంతాల ప్రజలు
- పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని వేడుకోలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నా యి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం ఉండడంతో మహిళలు నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలాల వద్ద ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు. దుండగులు ఆయా ప్రాం తాల్లో తిరుగుతూ అదును చూసి ఒంటరి మహిళల మెడలో నుంచి బం గారు గొలుసులు తస్కరిస్తున్నారు.
గురువారం ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ షాద్నగర్ పరిధిలో పొలంలో కూర్చుని ఉన్న వీరమ్మ అనే మహిళ మెడలో నుంచి మధ్యా హ్నం సమయంలో బైక్పై వచ్చిన దుండుగులు నాలుగు తులాల బంగారు పుస్తెల తాడునే లాక్కొని పరారయ్యారు. ఏడాది క్రి తం కేశంపేట్ పీఎస్ పరిధిలో పొలం నుంచి ఇంటికి వెళ్తున్నవృద్ధురాలి నుంచి స్నాచర్లు బంగారు గొలుసు తెంపి ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నగరంతో పాటు వివి ధ రాష్ర్టాలకు చెందిన వారు జీవనోపాధి కోసం వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇండస్ట్రిస్తో పాటు వ్యవసాయ పనుల్లోను ఆయా రాష్ర్టాలకు చెందిన వారు పనిచేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటూ అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠాలు మహిళలను టార్గెట్ చేస్తున్నాయి.
ఒక్కో పోలీస్స్టేషన్ పరిధిలో ఒకటి రెండు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఉద యం, సాయంత్రం పెట్రోలింగ్ వాహనాలు పెట్రోలింగ్ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్తోనే స్నాచర్ల ఆటకట్టించ వచ్చని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గ్రామానికో పోలీసు అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుమానితులుంటే సమాచారం ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించి నేరాలకు ముకుతాడు వేసేందుకు పోలీసులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

