BRSV | నిజాంపేట, మార్చి 22 : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పిలుపు లేకున్నా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్వీ నియోజకవర్గం అధ్యక్షుడు బజారు రంజిత్‌గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా రంజిత్‌గౌడ్ మాట్లాడుతూ.. అంసెబ్లీ ముట్టడికి కాని, సమస్యల పరిష్కారం కోసం ధర్నాకు వెళ్తున్న వారిని కానీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం చూశామని.. ఏ కారణం లేకున్నా ముందస్తు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయిండని, విద్యార్థి సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్ చేసే ప్రతిస్థితులు పోయి ప్రజలే కాంగ్రెస్ నాయకులను నిర్భంధం చేసే రోజులు వస్తాయన్నారు. ప్రతిపక్ష నాయకుల అరెస్ట్‌పై చూపుతున్న శ్రద్ధలో సగం ఆరు గ్యారెంటీలపై పెడితే ఇప్పటి వరకు ఆ పథకాలు అమలు అవుతుండేవని సలహా ఇచ్చారు.
ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ముమ్మాటికీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు