నిజాంపేట,మే2 : నిజాంపేటకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు ముస్తాఫా(30) నాలుగు రోజుల క్రితం శ్వాస సంబంధ సమస్యతో బాధపడగా గమనించిన కుటుంబసభ్యులు కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో మెరుగైన చికిత్స అందించడం కోసం హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు తరలించినా ఫలితం లేకుండా పోయింది.
చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేసిన ముస్తాఫా మరణ వార్త విన్న పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ముస్తాఫా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.