సిద్దిపేట, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈనెల 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు పార్టీ ఇన్చార్జిలను నియమించారు. సిద్దిపేట జిల్లాకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్ జిల్లాకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి జిల్లాకు మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలను నియమిస్తూ ఆదివారం బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షాదివస్ నిలుస్తుంది. 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధన సాధ్యమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ ఇన్చార్జిలు నియమించడంతో వారు అన్ని నియోజకవర్గాల్లోని క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.