చేగుంట : చేగుంట కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ( BRS ) మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ( Padmadevender Reddy) అన్నారు. నార్సింగి మండలపరిధిలోని సంకాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త బోడ కుమార్ ఏర్పాటు చేసిన వ్యాపార దుకాణ సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిందని తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదేని జరిగితే బీమా ద్వారా పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, గోండ స్వామి,యాదగిరి, నరసింగరావు,సిద్దాగౌడ్, దుర్గరెడ్డి,మహేష్, మోహన్‌రెడ్డి,మల్లేశం, శ్యాం, సిద్దేశ్, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.