రాయపోల్,ఏప్రిల్19 : వరంగల్ జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదిలిరావాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ స్థాపించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వ మే..మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో స్వర్ణయుగమని,అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే హామీలను తుంగ లో తొక్కి, ఆరు గ్యారెంటీలను విస్మరించిందన్నారు. ఉద్యమాల గడ్డ ..బీఆర్ఎస్ అడ్డా దుబ్బాక నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో కదలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన కార్యకర్తకు సూచించారు.
దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు అండగా ఉంటూ వస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆధిక్యం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా గులాబీ జెండాఎగరడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ,మాజీ జడ్పీటీసీ యాదగిరి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు పర్వేజ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వెంకట్‌గౌడ్,యువజన నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్,కల్లూరి శ్రీనివాస్, మం డల యూత్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.