రామాయంపేట, నవంబర్ 6: తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుపొంది కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. సోమవారం రామాయంపేటకు వచ్చిన సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ను ముదిరాజ్ సంఘం మహాసభ జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దంపతులు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.
అట్టడుగు వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ చలవేనన్నారు. కార్యక్రమంలో పురపాలిక వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, యాదగిరి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పుట్టి రాజు, రాష్ట్ర కర్యదర్శి పుట్టి అక్షయ్, శ్రీనివాస్, జాల సాయిబాబ, రామకిష్టయ్య, ఎర్రం ఆంజనేయులు, పోచమ్మల అశ్విని, శ్రీనివాస్, ఆర్టీసీ గంగారాం, మల్లేశం, రమాకాంత్, యాదగిరి, కౌన్సిలర్లు దేవుని రాజు, చిలుక గంగాధర్, మాజీ ఎంపీటీసీ ఐలయ్య, చింతల ఏసుపాల్, జలగడుగుల శ్రీనువాస్, గొల్పర్తి, తదితరులున్నారు.