సంగారెడ్డి , నవంబర్ 26(నమస్తే తెలంగాణ): కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసి దీక్షా దివస్‌తో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ పోరాటపటిమ భావితరాలకు తెలిసేలా ఈనెల 29న సంగారెడ్డిలో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకుడు దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు జైపాల్‌రెడ్డి, పట్నం మాణిక్యం, ఆదర్శ్‌రెడ్డి, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.
సన్నాహాక సమావేశంలో ఈనెల 29న దీక్షా దివస్ నిర్వహణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కందిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈనెల 29న దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 29, నవంబర్ 2009న కేసీఆర్ చేపట్టిన దీక్షాదివస్‌కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే అప్పటి ఢిల్లీ సర్కార్ దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు.
తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేటీఆర్, హరీశ్‌రావు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ విషయాలన్నీ ప్రజలు, యువతకు తెలిసేలా, దీక్షా దివస్ స్ఫూర్తి రగిలేలా ఈనెల 29న కందిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీక్షా దివస్‌కు ఐదు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
దీక్షా దివస్ సన్నాహక సమావేశం మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు జైపాల్‌రెడ్డి, పట్నం మాణిక్యం, ఆదర్శ్‌రెడ్డి, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, శివరాజ్‌పాటిల్, కోడూరి రమేశ్, ఆదర్శ్‌రెడ్డి, సోమిరెడ్డి, వెంకటేశంగౌడ్, అంజయ్యయాదవ్, సాయికుమార్, డాక్టర్ శ్రీహారి, మల్లయ్య, రవీందర్‌నాయక్, నజీబ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
దీక్షా దివస్ విజయవంతం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ సందర్భంగా చర్చించారు. ఏర్పాట్లకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించాలని నిర్ణయించారు. 29న సంగారెడ్డి పట్టణంతో పాటు కంది గులాబీమయంగా మారాలని, ప్రతిచోట పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పార్టీ నాయకులకు సూచించారు.
కేసీఆర్ చేపట్టిన ఆమరణదీక్ష ప్రాధాన్యత అందరికీ తెలిసేలా దీక్షాదివస్ రోజున ఫొటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం దేవీప్రసాద్, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, శివకుమార్, జైపాల్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ తదితరులు కందిలోని పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. దేవీప్రసాద్ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా నాయకులకు పలు సూచనలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మృత్యువు ముఖంలో తలపెట్టి తెలంగాణ సాధించారని, దీక్షా దివస్ చరిత్రలో నిలిచిపోతుందని జిల్లా పరిశీలకుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ద్వారా ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చేలా చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్షా దివస్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచిందన్నారు. కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేలా ప్రజలు మరోమారు దీక్షా దివస్ స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 29న కందిలో నిర్వహించే దీక్షా దివస్‌కు ఐదు నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని దేవీప్రసాద్ కోరారు.
– మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా పరిశీలకుడు దేవీప్రసాద్