న్యాల్కల్ /జహీరాబాద్, అక్టోబర్ 22 : తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించి, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కావడం ఖాయమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. ఆదివారం న్యాల్కల్ మండలంలోని చీకుర్తి, అమీరాబాద్, ముర్తుజుపూర్, కాకిజనవాడ, చల్కి, రాఘవపూర్, హుమ్నాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు స్థానిక వ్యక్తి అని, ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో స్థానికేతరులు వస్తున్నారని..వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. వారు ఎన్నికలు ముగిసిన వెంటనే వికారాబాద్‌కు వెళ్లిపోతారన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం మహిళలు, రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు రూ. 400 గ్యాస్ సిలిండరు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ప్రచారంలో టెలికం బోర్డు సభ్యులు, నియోజకవర్గ గిరిజన తండాల ఇన్చార్జి పవార్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు రవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, భాస్కర్, నరేశ్, చంద్రప్ప, పాండురంగారావు పాటిల్, నర్సింహ్మరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రకాంత్ పాటిల్, చంద్రశేఖర్‌రెడ్డి, రవీందర్, మారుతి, నిరంజన్‌రెడ్డి, బస్వరాజ్ పాటిల్, గౌసోద్దీన్, అనుషమ్మ, మంజుల, మణె మ్మ, రత్నం, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.