సంగారెడ్డి, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమం గా కేసు పెట్టిందని, ఫార్ములా ఈ-రేస్‌లో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. సం గారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాం పు కార్యాలయంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు మంచి గుర్త్తింపు లభించడంతో పాటు రూ.700 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
ఫార్ములా ఈరేస్ నిర్వహణతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కంపెనీలు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఫార్ములా ఈ-రేస్‌తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు. కానీ, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి జరిగినటు చూపడం విడ్డూరం గా ఉందన్నారు. రూ.55 కోట్లు తమకు అందినట్లు ఎఫ్ఈవో సంస్థ చెప్పినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై ఏసీ బీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇరికించేందుకు రేవంత్ సర్కార్ కుట్రపన్నుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ పోరాటం చేస్తుండడం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు మింగుడు పడడం లేదన్నారు. దీంతో ఆయనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫార్ములా ఈ కారు రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై పెట్టిన కేసు లో దమ్ములేనందునే అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీఐడీ ఆఫీసర్లు, పోలీసులుగా ప్రవర్తిస్తున్నారని, ఇది మం చి పద్ధ్దతి కాదని హెచ్చరించారు. ఇకనై నా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై దుష్ర్పచారం మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్‌పై నమోదు చేసిన తప్పు డు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు జైపాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింహులు, డాక్టర్ శ్రీహరి, విజయేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జీవీ శ్రీనివాస్, మల్లాగౌడ్ పాల్గొన్నారు.