BRS Party | రాయపోల్, ఏప్రిల్ 05 : ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్, హరీష్ రావు పిలుపుమేరకు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి సుమారుగా 100 మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ పర్వీజ్, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు ఇప్ప దయాకర్, కల్లూరు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు వెంకట్ గౌడ్, మాజీ ఎంపిటిసి రాజు గౌడ్, నవీన్ గౌడ్, భార్గవ్, శ్రీధర్, మురళి, చింతకింది మహేష్ తదితరులు పాల్గొన్నారు.