కోహెడ, జూలై 10: తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే అందరికీ ఎనలేని అభిమానం. సిద్దిపేట జిల్లా మండలంలోని వరికోలు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మడుపు సంతోష్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా మడి నుంచి నారుతీసి వేసే క్రమంలో సంతోష్‌రెడ్డి కుమారులు బీఆర్ఎస్ పేరుతో నారు ఉంచి పార్టీపై తమ అభిమానాన్ని చాటారు.