పెద్దశంకరంపేట, మార్చి 18: జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం ఆరెపల్లిలో నిర్వహించిన బీరప్ప జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దశంకరంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. ఎంపీలుగా చేసిన బీబీ పాటిల్, సురేశ్‌కుమార్ షెట్కార్ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. తనకు అవకాశం ఇస్తే నారాయఖేడ్ ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోనే నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌కుమార్ షెట్కార్ ఎంపీగా ఉన్నప్పుడు దేవాలయ భూములను వదలకుండా స్వాహా చేశారని ఆరోపించారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రూ.15 వేలకు రైతుబంధు పెంచుతామని చెప్పిన నాలుగు ఎకరాల రైతులకు కూడా డబ్బులు వేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పూటకో మాట చెబుతూ కాలం వెళ్ల దీస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు, రైతుబిడ్డ గాలి అనిల్‌కుమార్ మన ప్రాంతబిడ్డ, ఈ ప్రాంత కష్టసుఖా లు, సమస్యలు ఆయనకు తెలుసున్నారు. బీబీ పాటిల్ పదేండ్లలో పదవిని అడ్డం పెట్టుకొని కంగ్టి మండలంలో పేద రైతుల భూములను గుం జుకున్నాడని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజ లు బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీటీసీలు దత్తు, సురేశ్‌గౌడ్, రాజేశ్వర్, నాయకులు కుంట్ల రాములు, విఠల్‌గౌడ్, రవీందర్, నరేశ్, వెంకట్‌రెడ్డి, గంగారాం, శంకర్‌గౌడ్, కో-ఆప్షన్ యాదూల్ తదితరులు పాల్గొన్నారు.