జహీరాబాద్, మార్చి 1: జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. శుక్రవారం బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎంపీ బీబీపాటిల్ 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.