MLA Manik Rao | జహీరాబాద్, ఆగస్ట్ 8 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు, బూత్‌స్థాయి బాధ్యులు సిద్ధంగా ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్య రావు అన్నారు. శుక్రవారం న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్, చాల్కి, హుమనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని చేపట్టేబోయే కార్యాచరణ గురించి వివరించాలని శ్రేణులకు సూచించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, పార్టీ నాయకులు అశోక్ పాటిల్, సుధాకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మల్లయ్య, కైరుద్దీన్ పటేల్, దత్త రెడ్డి, అశోక్, రాజు, శ్రీకాంత్, వీర్ శెట్టి, అనిల్, ఫయాజ్, రమేష్, జీవన్ రెడ్డి, వెంకట్, సిద్ద రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య, ప్రకాష్, సిద్దయ్య స్వామి, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.