సిద్దిపేట/చిన్నకోడూరు నవంబర్ 25: సిద్దిపేట నియోజకవర్గంలోని పలువురు కుటుంబాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం పరామర్శించారు. ఇటీవల ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న 30వ వార్డు కౌన్సిలర్ ఫాతిమా బేగం భర్త, పార్టీ సీనియర్ నాయకుడు వజీర్‌ను హరీశ్‌రావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని వజీర్ కుటుంబానికి భరోసానిచ్చారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని పలువురు మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ కూర రవీందర్ రెడ్డి మరణించగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రవీందర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని రెండో వార్డు కౌన్సిలర్ చంద్రం తల్లి మృతి చెందగా ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కౌన్సిలర్ చంద్రాన్ని ఓదార్చారు. సిద్దిపేట అంబేదర్ నగర్‌కు చెందిన ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు సాకి గాంధీ తండ్రి ఆశయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీని ఓదార్చి ధైర్యం చెప్పారు. చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామ రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.