చేర్యాల, జూన్ 16 : జనగామ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ శ్రేణులు సుఖసంతోషాలతో ఉండే విధంగా అహర్నిషలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు నిత్యం పూజలు చేస్తున్నారు.సోమవారం చేర్యాలటౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
స్వామి వారి ఆలయంలోని మహామండపంలో పెద్ద పట్నం వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రజల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు గీస భిక్షపతి, అనంతుల మల్లేశం, ముస్త్యాల నాగేశ్వర్రావు, ముఖ్య నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, తలారీకిషన్, వుల్లంపల్లి కరుణాకర్, సిలువేరు సిద్ధప్ప, సుంకరి మల్లేశంగౌడ్, పుర్య వెంకట్‌రెడ్డి,పెడుతల ఎల్లారెడ్డి,శివగారి అంజయ్య, జింకలపర్వతాలుయాదవ్, ముత్యం నర్సింహులు, మలిపెద్ది మల్లేశం,నాచగొని వెంకట్‌గౌడ్, మెరుగుకృష్ణాగౌడ్, తాడెం రంజితాకృష్ణ్ణమూర్తి, మీస పార్వతి, పచ్చిమడ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.