BRS Rajathotsava Sabha | రామాయంపేట, ఏప్రిల్ 19 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్ఎస్ నేతలు వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.
ఇవాళ రామాయంపేట పట్టణ శివారులోని గోడలపై వాల్రైటింగ్ రాస్తూ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి పెద్ద ఎత్తున సభకు తరలివెళ్లాలని కార్యకర్తలు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు.
ఈ వాల్ రైటింగ్ కార్యక్రమంలో చిట్టిమల్లి నరేందర్రెడ్డి, శ్రీకాంత్ సాగర్, నర్సింహులు, సాయి విజ్ఙాన్రెడ్డి, నాగ రాజు, రమేష్ తదితరులు ఉన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్