నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
- సిద్దిపేట జిల్లా కొండాపూర్లో ఎండిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
మద్దూరు (ధూళిమిట్ట), మార్చి 30: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంద యాదగిరి మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవడంలో పంట లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం చెరువు, కుంటలను గోదావరి జలాలతో నింపాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన పంటలను సర్వే చేయాలన్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఉపసర్పంచ్ ఇస్లావత్ రమేశ్, నాయకులు ఎనగందుల యాదగిరి, బాకి మొగిలి, లింగాల సంపత్, మంద యాదయ్య, బావు మొగిలి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

