దుబ్బాక , సెప్టెంబర్ 6: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యేల విగ్రహాల ఏర్పాటు విషయంపై ఉద్రిక్తత వాతావర ణం చోటుచేసుకుంది. శుక్రవారం దుబ్బాక బస్టాండ్ వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహం ఏర్పా టు కోసం బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ విష యం తెలుసుకున్న కాంగ్రెస్ నా యకులు ఘటనా స్థలానికి చేరుకుని దివంగత చెరుకు ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం ఇక్కడే భూమి పూజ చేస్తామనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వా దం నెలకొంది.
ముందుగానే ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించామని కాం గ్రెస్ నాయకులు ఆరోపించగా ఉద్యమనేత సోలిపేట రామలింగారెడ్డి విగ్ర హం ఇక్కడే ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేశామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. విష యం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ మధు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని, అప్పటి వరకు విగ్రహాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేయవద్దని ఏసీపీ మధు, మున్సిపల్ కమిషనర్ రమేశ్ ఇరువర్గాల వారికి సూచించి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.