చేర్యాల, మార్చి 1: తెలంగాణ వరప్రదాయిని, జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిత్యం విషం చిమ్ముతున్న కాంగ్రెస్ సర్కారుకు రైతులు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం అన్నారు. చలో మేడిగడ్డ కార్యక్రమానికి చేర్యాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలిపోయారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమేనని, కృంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులకు నిర్మాణ సమస్యలు వచ్చాయని, వాటిని అక్కడి ప్రభుత్వాలు మరమ్మతులు చేయించి సమస్యలను పరిష్కరించాయన్నారు. స్వార్థ రాజకీయాలను పక్కనపెట్టి రైతులకు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలన్నారు. మేడగడ్డను మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ చేర్యాల టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడురు బాలరాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, యూత్ ఇన్చార్జి అంజయ్య, యూత్ మండల అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్, నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సిద్ధిరాములు, చింతల పరశురాములు, గిరిధర్, తాండ్ర సాగర్ ఉన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 1: కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో బీఆర్ఎస్ మద్దూరు, ధూళిమిట్ట మండలాల అధ్యక్షులు మేక సంతోశ్‌కుమార్, మంద యాదగిరి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, కురుమ సంఘం మండల అధ్యక్షుడు బర్మ రాజమల్లయ్య, నాయకులు బొల్లు చంద్రమౌళి, సుందరగిరి పరశురాములు, ఊట్ల రవీందర్‌రెడ్డి, పురుషోత్తం, పేర్ని రాజు, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.