సిద్దిపేట, అక్టోబర్ 1: మల్కాజిగిరిలో ప్రజలు మైనంపల్లి హన్మంతరావును తిరస్కరించడంతో మతిస్థిమితం కోల్పోయి ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగినశాస్తి తప్పదని సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు కుంబాల ఎల్లారెడ్డి, కోల రమేశ్‌గౌడ్, మేర్గు మహేశ్ హెచ్చరించారు. మం గళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల తో వారు మాట్లాడుతూ.. తొగుటలో మైనంపల్లి హన్మంతరావు హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
మల్లన్నసాగర్ నిర్మించి కేసీఆర్, హరీశ్‌రావు బీడు భూములను సస్యశ్యామలం చేశారన్నారు. మంత్రి పదవి కోసం ఇష్టం వచ్చినట్లు కేసీఆర్, హరీశ్‌రావులపై మాట్లాడితే నాలుక చీరేస్తామన్నారు. సిద్దిపేటకు వచ్చి రౌడీయిజం చేస్తానంటే కుదరదని, సిద్దిపేటకు మైనంపల్లికి ఏం సం బంధం అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి దృష్టిలో పడాలనే ఆకాంక్షంతో అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్ మైనంపల్లికి హరీశ్‌రావును విమర్శించే స్థాయి లేదన్నారు.
హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, హెడ్రా బాధితులకు హరీశ్‌రావు అం డగా నిలవడంతో ప్రభుత్వంలో వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్‌కు వచ్చి బురద రాజకీయం చేసే బదులు, బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని హితవు పలికారు. మైనంపల్లి తన తీరును మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కీసర పాపయ్య, ఆంజనేయులురెడ్డి యాదగిరి, సామల్ల సాయిప్రేమ్, ఆకుబత్తిని రాము, లింగం, ప్రశాంత్ ముదిరాజ్, నాగరాజు, దేవరాజు, గుజ్జరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.