రామాయంపేట రూరల్, జూన్04 : పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, చాకలి పోచయ్య డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట సాయం ముందుగానే వచ్చేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.
పంట సాయం అందకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి నిర్లక్ష్యంగా వ్యవహరింస్తోందని మండిపడ్డారు. రైతులను పట్టించుకోకుంటే తగిన గుణపాఠం తప్పదనిన్నారు. వెంటనే రైతులకు పంట సాయం అందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.