సిద్దిపేట, ఆగస్టు 17: సిద్దిపేట పట్టణంలో శుక్రవారం అర్ధరా త్రి హైటెన్షన్ నెలకొన్నది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కిం చపర్చే విధంగా కాగ్రెస్ నాయకులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్ట గా వారిని పోలీసులు ఆరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిచేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మె ల్యే హరీశ్‌రావు ఫ్లెక్సీలను చింపివేశారు.దీంతో శనివారం ఉద యం సిద్దిపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుం చే భారీ ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. ఉద యం ఎమ్మెల్యే హరీశ్‌రావును కించపర్చేవిధంగా ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు తొలిగించారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధక్షుడు సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నల్లబ్యాడ్డీలు ధరించి,నల్ల జెండాలను చేతపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నివాదాలు చేశారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ లక్ష్మీబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం పాత బస్టాండ్ వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ నా యకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పాతబస్టాండ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. అదే సమయంలో పోటీగా ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఆరెస్టు చేసి వ్యాన్‌లో పాతబస్టాండ్ వైపు నుంచి తరలిస్తుండగా వారు నివాదాలు చేయడంతో పోలీసుల వ్యాన్‌పైకి బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్లే ప్రయ త్నం చేయడంతో పోలీసులు కట్టడి చేశారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఆరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈసందర్భగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కొండం సంపత్‌రెడ్డి, పాల సాయిరామ్ మాట్లాడుతూ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను వెం టనే అరెస్టు చేయాలని, శాంతియుతంగా ఉన్న సిద్దిపేటలో చిచ్చురగిల్చే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.శాంతి భద్రతలు కాపాడడం పోలీసుల బాధ్యత అన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిందన్నారు.
సిద్దిపేటలో ఏ సంఘటన జరిగినా పోలీసులు, కాంగ్రెస్ నాయకులు బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు. సిద్దిపేట ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని కించపరుస్తూ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలిగించాలని చట్టబద్ధంగా కోరితే పూర్తిగా నిర్లక్ష్యం వహించి వత్తాసు పలికే విధంగా ఉండటం సరికాదన్నారు. సంపూర్ణంగా పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, ధర్మవరం బ్రహ్మం, సోమిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రమేశ్ గౌడ్, ఎల్లారెడ్డి, రెడ్డి యాదగిరి, రజనీకాంత్, మహేశ్‌తోపాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు శనివారం ఉదయం ప్రయత్నించారు. ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని ఆరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కించపర్చేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్‌కు, సీపీ అనురాధకు ఫిర్యాదు చేశారు.