చేర్యాల, జనవరి 23 : జనగామ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, తగిన బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి జ్ఞానోదయం కలగడం లేదని బీఆర్ఎస్ చేర్యాల పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి తదితరులు విమర్శించారు.
చేర్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జనగామలో మంత్రి సీతక్క పాల్గొన్న కార్యక్రమంలో ఎలాంటి ప్రొటోకాల్ లేని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారని, అంతేకాకుండా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మద్యం తాగించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పై దాడి చేయించేందుకు యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.అభివృద్ధిలో పోటీ పడాలి కానీ, మంత్రులు వచ్చిన కార్యక్రమాల్లో మంది మార్బలంతో వచ్చి తాగుబోతులతో హంగమా చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తన ఊరిలో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని సర్పంచ్‌గా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. జనగామ పట్టణంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన సమయంలో మంజూరు చేయించిన నిధులతో చేసిన పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవం చేశారన్నారు. అభివృద్ధి గురించి ఏరోజు ఆలోచన చేయని అయ్యా,కొడుకులు గుండాలతో రాజకీయం చేస్తామంటే ఊరుకోమన్నారు.
ప్రస్టేషన్‌తో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, పద్ధ్దతి మార్చుకోకపోతే గులాబీ దళం తగిన తీరిలో బుద్ధి చెబుతుందని కొమ్మూరికి హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, పట్టణ కార్యదర్శి బూరగోని తిరుపతిగౌడ్, నాయకులు రాళ్లబండి పరిపూర్ణం, పచ్చిమడ్ల మానస, పట్టణ యూత్ అధ్యక్షుడు యాట భిక్షపతి, మల్లన్న ఆలయ మాజీ డైరెక్టర్ ఊట్కూర్ అమర్‌గౌడ్, బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం పాల్గొన్నారు.